కారుకు నిప్పు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

KNR: గంగాధర మండలం మధురనగర్‌లో మోతె శ్రీహరి రెడ్డి అనే వ్యక్తి తన కారును ఇంటి పక్కన పార్క్ చేయగా శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. కారు యజమాని మంటలను గమనించి, వాటిని ఆర్పేసి పోలీసులకు సమాచారం అందించారు.ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.