నేడు వైవీయూను సందర్శిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి
kdp: దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబరు 1న మధ్యాహ్నం 3:30 గంటలకు యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. వైవీయూలో నూతన పరిపాలన భవనంలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య సెనెట్ హాల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు.