రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ్మడపల్లె బాలుడు

NDL: మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన డి. షణ్ముఖ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడల్లో ప్రతిభ కనబరిచాడు. తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. సెప్టెంబర్ 8 నుంచి ఉత్తరాఖండ్లోని హల్వానీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని కోచ్ లక్ష్మణ్ తెలిపారు.