పండ్ల వ్యాపారులు మోసాలు.. 300 గ్రాములు కోత

పండ్ల వ్యాపారులు మోసాలు.. 300 గ్రాములు కోత

VZM: రాజాంలో కొందరు పండ్ల వ్యాపారులు మాయాజాలం చేస్తున్నారు. కొనుగోలుదారుల కిలో పండ్లు కొంటే 300 గ్రాములకు కోత పడుతుంది. ఇందేంటి అని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. దీంతో కొలతల శాఖ అధికారులు ఎస్.ఉమాసుందరి, ఎ.బలరామకృష్ణ మంగళవారం పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. 16 పండ్ల దుకాణాలు, రెండేసి పాత ఇనుము కొనుగోలు కేంద్రాలు, ఎరువుల దుకాణాలపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.