మహబూబ్‌నగర్‌లో ఉచిత టాలీ శిక్షణ
జిల్లా కేంద్రంలోని టాస్క్ కేంద్రంలో ఉచిత టాలీ ఈఆర్‌పీ విత్ జీఎస్టీలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని టాస్క్ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని టాస్క్ ట్రైనింగ్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ ఆఖరు అని వెల్లడించారు.