బుచ్చినాయుడు కండ్రిగలో లారీ బోల్తా

TPT: బుచ్చినాయుడు కండ్రిగ మండలం పలమాల సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఓ లారీ బోల్తా కొట్టింది. వివరాల్లోకెళ్తే కర్ణాటక నుంచి గుమ్మడిపూడికి మట్టితో వెళ్లే లారీ ఒకసారిగా అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.