PSLV-C16 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్

PSLV-C16 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్

NLR: శ్రీహరికోటలోని ఇస్రోలో సోమవారం ప్రయోగించనున్న PSLV-C16 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 1485 కేజీల బరువు గల ఈ ఉపగ్రహాన్ని ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ఈ భూపరిశీలన ఉపగ్రహానికి అన్వేషగా ఇస్రో నామకరణం చేసింది. కాగా, ఇది నూతన సంవత్సరంలో ఇస్రో ప్రయోగించనున్న మొదటి రాకెట్ ప్రయోగం.