VIDEO: రేణిగుంటకు చేరుకున్న రాష్ట్రపతి
TPT: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేణిగుంటకు వచ్చారు. స్థానిక ఎయిర్‌పోర్టులో ఆమెకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి సవిత, కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె హెలికాప్టర్‌లో వేలూరులోని బంగారు గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్ వెళ్తారు.