చంద్రబాబుకు అండగా ఉందాం: నారా లోకేశ్

TPT: భవిష్యత్ తరాల కోసం 75 ఏళ్ల వయసులో కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గ కార్యకర్తలతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అనగాని సత్యప్రసాద్, పల్లా శ్రీనివాసరావు, దీపక్ రెడ్డి, నరసింహ యాదవ్, చంద్రశేఖర్ నాయుడు, బాబు, శ్రీపతిబాబు తదితరులు పాల్గొన్నారు.