క్రోసూరులో సందర్శించిన ఎస్పీ

PLD: పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బుధవారం ఆయన క్రోసూరు మండలం దొడ్లేరు, ఊటుకూరు గ్రామాలను సందర్శించారు. దొడ్లేరు వద్ద కల్వర్టుపై వరద ఉధృతి తగ్గే వరకు రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08647 232999కు కాల్ చేయవచ్చని తెలిపారు.