వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన
AKP: పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామం హనుమాన్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి జనసేన పార్టీ మండల ఇంఛార్జ్ పంచకర్ల ప్రసాద్ శంకుస్థాపన చేశారు. 20వేల సామర్థ్యంతో మంచినీటి ట్యాంకు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధులతో నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.