విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో లక్షల్లో నష్టం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో లక్షల్లో నష్టం

సత్యసాయి: అగళి మండలం పీ బ్యాడగేర గ్రామానికి చెందిన రైతు హనుమంతరాయప్ప వ్యవసాయ పొలంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. స్టార్టర్‌తోపాటు గుడిసెలో ఉన్న డ్రిప్ పరికరాలు, ఎర్రగడ్డల బస్తాలు పూర్తిగా కాలిపోయాయి. అప్పులు చేసి బోరు వేయించిన రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లిందని బాధితుడు వెల్లడించారు.