గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన

గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన

MNCL: జన్నారంలో గణేష్ నిమజ్జనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని ఎస్సై గొల్లపల్లి అనూష, ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, తహశీల్దార్ రాజమనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలోని వాగు వద్ద ఉన్న నిమజ్జన స్థలాన్ని వారు పరిశీలించారు. నిమజ్జనం చేసే ప్రదేశాన్ని శుభ్రం చేయించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.