శనగ రైతులు ఆందోళన చెందవద్దు: కంది శ్రీనివాస రెడ్డి
ADB: పంట కొనుగోలు జరగడం లేదని శనగ రైతులు ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఇదే విషయమై తాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో ఫోన్‌లో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.