'మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించండి'
E.G: సీతానగరం మండలంలోని అచ్చియ్యపాలెం, పెదకుండేపూడి, నాగలపల్లి మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అవస్థలు ఎదుర్కొంటున్నారని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి అలివేల వీరబాబు తెలిపారు. విద్యార్థులు స్కూలు, కాలేజీకి వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయిస్తున్నారు కావున ఎమ్మెల్యే బత్తుల.బలరామకృష్ణ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్ ఏర్పాటు చేయాలన్నారు.