ఈనెల 18 నుంచి వినియోగదారుల దినోత్సవాలు

ఈనెల 18 నుంచి వినియోగదారుల దినోత్సవాలు

AKP: జాతీయ వినియోగదారుల దినోత్సవాలను ఈనెల 18 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు DRO సత్యనారాయణరావు తెలిపారు. దీనిలో భాగంగా హైస్కూల్స్, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. వినియోగదారుల హక్కుల పై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు గోడ పత్రిక ఆవిష్కరించారు.