విమానాల రద్దు పై ఇండిగో కీలక ప్రకటన

దేశంలోని గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ ఉ.5.30 గంటల వరకు 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. అమృత్‌సర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ విమానాశ్రయాల నుంచి సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపింది. విమానాల రీషెడ్యూల్ చేసుకోవచ్చని.. టిెకెట్ రద్దు చేసుకున్న వారికి రీఫండ్ కూడా ఇస్తామని చెప్పింది.