BR నాయుడిపై రోజా ఫైర్..!
CTR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఎంతో పవిత్రంగా చూడాల్సిన ఛైర్మన్ పదవిని ఆయన అపహాస్యం చేశారన్నారు. ఆయన ఎప్పుడూ టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించలేదని మండిపడ్డారు. చంద్రబాబు మెప్పుకోసం ఆయన చేసే పనులన్నీ గొప్పగా చూపడం, వైసీపీ వాళ్లపై తన ఛానల్లో నిందలు వేయడం పరిపాటిగా మారిందన్నారు.