ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సత్కారం
AKP: పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం పంచాయతీ పరిధిలో తీర ప్రాంతంలో ప్రజలకు మొంథా తుఫాన్ సమయంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శనివారం సత్కరించారు. సత్కారం పొందిన వారిలో ప్రత్యేక అధికారి అనిత, ఎమ్మార్వో నాగరాజు, ఎంపీడీవో రమేష్ బాబు, ఆర్ఐ రమణ, సర్పంచ్ సుజాత ఉన్నారు. విపత్కర పరిస్థితిలో వీరు అందించిన సేవలను ఆయన కొనియాడారు.