పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
VZM : గజపతినగరం పురిటిపెంట పంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం సచివాలయం వద్ద ధర్నాని నిర్వహించారు. బకాయి జీతాలు చెల్లించడంతో పాటు ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు.