ధర్మారం మండలంలో ముగ్గురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
PDPL: ధర్మారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో 3 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయకంపల్లిలో బీఆర్ఎస్ బలపరచిన షైనేని రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు బంజేరుపల్లి సర్పంచ్‌గా కళ్లెం ఇందిర, బొట్ల వనపర్తి సర్పంచ్‌గా సంగ రంజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో రంజిత్ అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు.