శివాజీ జయంతి వేడుకలు.. రక్తదాన శిబిరం..!
NRPT: నర్వ మండలం కల్వలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీసం చెన్నయ్య శివాజీ మహనీయ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.