పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు

ELR: ఈనెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరులో 9, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.