నాగ్‌పూర్‌లో పేలుడు పదార్థాల కలకలం
నాగ్‌పూర్‌లో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. RSS ప్రధాన కార్యాలయానికి సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 15 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, 8 కనెక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బృందాలు భారీగా మోహరించాయి. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో నాగ్‌పూర్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.