అంతర పాఠశాలల క్రీడల పోటీలకు ఏర్పాట్లు
SKLM: వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ఉన్నత పాఠశాలలో 76వ నియోజకవర్గం స్థాయి అంతర పాఠశాలల ఆటల పోటీలు గురువారం నుండి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలికల కబడ్డీ, వాలీబాల్, టెన్నీకాయిట్, బాడ్మింటన్ తదితర విభాగాల్లో పోటీల జరుగుతాయని హెచ్ఎం టి.హేమారావు తెలిపారు. అలాగే 12వ తేదీన బాలురకు వివిధ ఆటల పోటీలతో పాటు బాలికల అథ్లెటిక్స్ ఉంటాయన్నారు.