'రూ.20తో రూ.2 లక్షల బీమా'
NLG: వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకు గాను బ్యాంకులు రూ.2 లక్షలతో వివిధ రకాల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే బీమా వర్తిస్తుందన్నారు. కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తింపజేసేందుకు శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.