బార్ కౌన్సిల్ సభ్యులకు సన్మానం

బార్ కౌన్సిల్ సభ్యులకు సన్మానం

RR: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందిన RR జిల్లా కోర్టులకు చెందిన ఐదుగురు సభ్యులను స్థానిక న్యాయవాదుల సంఘం ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కార్తీక్ బాసేటి ఆధ్వర్యంలో నిన్న జిల్లా కోర్టుల్లోని కాన్ఫరెన్స్ హాలులో నూతన సభ్యులను సన్మానించారు. శాసనసభలో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు పాస్ కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.