దున్నపోతుకు SFI నేతల వినతి పత్రం
NLG: విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఎన్ని ఉద్యమాలు చేసినా దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందని ఎస్ఎఫ్ఐ చిట్యాల మండల కార్యదర్శి అరూరి ప్రణీత్ విమర్శించారు. 8 వేల కోట్ల పైచిలుకు స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మండలంలోని వెలిమినేడులో ఆదివారం దున్నపోతుకు వినతి పత్రాన్ని అందించారు.