అప్పుడు తిట్టారు..ఇప్పుడు మెచ్చుకుంటున్నారు: రేవంత్
TG: హైదరాబాద్‌లోని బుమ్రక్ ఉద్దౌలా చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించిందని సీఎం రేవంత్ వెల్లడించారు. ఆక్రమణలను కూల్చివేస్తుంటే అందరూ తిట్టారని.. ఇప్పుడు చెరువును చూసి అంతా సంతోషపడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకువచ్చి కేటాయిస్తామని పేర్కొన్నారు.