సోషల్ మీడియా వార్తలపై కేంద్రం క్లారిటీ

సోషల్ మీడియా వార్తలపై కేంద్రం క్లారిటీ

ఇరాన్‌పై దాడి కోసం అమెరికా భారత్‌ను సైనిక సాయం కోరినట్లు SMలో వస్తున్న వార్తలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో శాంతిని కాపాడటమే తమ ప్రాధాన్యత అని పేర్కొంది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఇరాన్-US ఉద్రిక్తతల విషయంలో భారత్ తన స్వతంత్ర వైఖరినే అనుసరిస్తుందని కేంద్రం తేల్చి చెప్పింది.