మద్యం అమ్మకాలపై సౌదీ కీలక నిర్ణయం
సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో మద్యం విక్రయాల నిబంధనలను సవరించింది. అయితే కేవలం నెలకు 50,000 రియాల్స్ లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ నివాసితులకే మద్యాన్ని అమ్మేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ సదుపాయాన్ని పొందేందుకు విదేశీయులు తమ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ వివరాలు సమర్పించిన తర్వాతే వారికి మద్యం అమ్ముతారు.