పెంటగాన్ ప్రాంతంలో పెద్దఎత్తున పిజ్జా ఆర్డర్లు
మరో 10 రోజులపాటు ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు చేయమని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అదనపు సైనిక బలగాల కోసం గడువు పెంపు అనేది ట్రంప్ ఎత్తుగడ కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పెంటగాన్ ప్రాంతంలో పిజ్జా ఆర్డర్లు పెరిగాయని ఓ వెబ్‌సైట్ పేర్కొంది. పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఏదో అలజడి జరుగుతుందనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది.