మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

MDK: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి, ఉపాధికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు పేర్కొన్నారు. మెదక్ మండలం కొంటూర్ చెరువులో చేప పిల్లలను వదిలారు. నియోజకవర్గంలోని 546 చెరువు, కుంటలలో 211.39 లక్షల చేప పిల్లను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 309 మత్స్యకార సంఘాలలో 16,820 సభ్యులకు జీవనోపాధి లభిస్తుందన్నారు.