అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

CTR: వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ వ్యవస్థాపకుడు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిర్భావ మహోత్సవానికి నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకుడు గురుసాల కిషన్ చంద్‌ను జనసేన నాయకులు ఆహ్వానించారు. జనసేన మండల అధ్యక్షుడు పురుషోత్తం ఆధ్వర్యంలో అజయ్, ప్రతాప్, ఉదయ్, హరి, ధనుంజయులు, హేమంత్, పుష్ప రాజ్ ఆహ్వాన పత్రం అందజేశారు.