కడపలో జార్జి రెడ్డి వర్ధంతి గోడపత్రిక ఆవిష్కరణ
KDP: భారత విద్యార్థి ఉద్యమ దిగ్గజం, PDSU వ్యవస్థాపకుడు జార్జి రెడ్డి 54వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న పిలుపునిచ్చారు. కడపలో ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. శాస్త్రీయ విద్య, సమసమాజ స్థాపన కోసం జార్జి రెడ్డి చేసిన పోరాటం మరువలేనిదని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన ఎంచుకున్న విప్లవ మార్గం గొప్పదని వారు పేర్కొన్నారు.