లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త నియామకం

లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త నియామకం

WGL: లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయకర్తగా ఆరెపల్లికి చెందిన సుంకరి ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త పర్చా కోదండరామారావు ప్రకటించారు. లోక్ సత్తా ఉద్యమ సంస్థలో ప్రశాంత్ సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర సభ్యులకు ప్రశాంత్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు.