VMRDA పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు
VSP: VMRDAకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి అంశాలు చర్చించారు.