అందెశ్రీ మరణం తీరని లోటు: MLA
BHPL: తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రచయిత, ప్రముఖ గేయకరుడు అందెశ్రీ మరణం తీరని లోటని BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ తెలుగు సాహిత్యానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.