'వ్యవసాయ పనిముట్లు పంపిణీ'

SKLM: నందిగాం మండలం పాలవలస గ్రామంలో ప్రాంతీయ తీర ప్రాంత వరి పరిశోధన సంస్థ (నైరా) వారు 80 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లు బుధవారం అందజేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పనిముట్లు ఉచితంగా పంపిణీ చేసినట్లు సర్పంచి బోకర సన్యాసిరావు పేర్కొన్నారు.