పద్మావతి జూనియర్ కాలేజీలో NCC క్యాడెట్ల ఎంపిక

TPT: పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో NCC క్యాడెట్ల ఎంపిక శనివారం జరిగింది. ప్రిన్సిపల్ భువనేశ్వరి దేవి ఆధ్వర్యంలో 5వ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ అధికారి అనూజ్ వాద్వా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. 55 మంది క్యాడెట్లను ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఐకమత్యం NCC నినాదమని చెప్పారు.