కాలేజీ బస్సును ఢీ కొన్న లారీ
KKD: శంఖవరం ఉన్నత పాఠశాల సమీపంలోని NHపై ఇవాళ ప్రైవేటు కళాశాల బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. శంఖవరం-రౌతులపూడి మార్గంలో లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడినన విద్యార్థులను స్థానికులు శంఖవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. స్థానిక TDP నాయకుడు పర్వత సురేష్ విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.