VIDEO: 'లంచం అడిగితే 1064ను సంప్రదించాలి'
ADB: ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేందుకు డబ్బులు అడిగితే 1064 నంబర్‌ను సంప్రదించాలని ఏసీబీ DSP మధు తెలియజేశారు. బోథ్ మండల కేంద్రంలో ఉపాధి హామీ బిల్లుల మంజూరుకు డబ్బులను అడిగిన ఫారెస్ట్ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగిందన్నారు. వివరాలను అందజేసిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలియజేశారు.