డ్రాలో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్
MDK: మెదక్ మండలం చీపురు దుబ్బ తండా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థికి అదృష్టం వరించింది. గ్రామపంచాయతీతో మొత్తం 377 ఓట్లు ఉండగా 367 పోల్ అయ్యాయి. అందులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేతవత్ సునీత, బీఅర్ఎస్ నుంచి పోటీ చేసిన బిమిలి ఇద్దరికి 182 సమానమైన ఓట్లు వచ్చాయి. అయితే రెండు ఓట్లు చెల్లనివి పడగా, ఒక్క ఓటు నోటాకు పడింది. దీంతో డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి సునీతను విజయం వరించింది.