రివార్డ్ పాయింట్ల పేరుతో జాగ్రత్త.. ఖాతా ఖాళీ అవ్వొచ్చు!
VKB: బ్యాంక్ రివార్డ్ పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల హెచ్చరించారు. "మీ రివార్డ్ పాయింట్ల గడువు ముగియబోతోంది.. వెంటనే నగదుగా మార్చుకోండి" అంటూ వచ్చే లింకులను నమ్మవద్దని సూచించారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని, మోసపోతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.