రాత్రికి రాత్రే అధ్వానంగా మారిన రోడ్లు

రాత్రికి రాత్రే అధ్వానంగా మారిన రోడ్లు

ADB: చిన్నపాటి వర్షానికే రహదారులు బురదమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న అర్థరాత్రి కురిసిన వర్షానికి భీపూర్‌లోని రహదారులు అధ్వానంగా మారాయి. ప్రధానంగా పిప్పల్ కోటి ఎక్స్ రోడ్డు నుంచి నిపాని వరకు పూర్తిగా బురదగా మారింది. వాహనాలు ఆ బురదలో కూరుకుపోడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలాని మంజూరైన రోడ్డు వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.