కుల గణన చేయడంలో స్టాలిన్ ఫెయిల్: అన్బుమణి
తమిళనాడులో కులగణన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని పట్టాలి మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు అన్బుమణి తెలిపారు. కులగణన చేయడంలో సీఎం స్టాలిన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఇప్పటికే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కులగణన జరిగిందని చెప్పారు. టీవీకే పార్టీ ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తుందన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దామని పేర్కొన్నారు.