శ్రీకాళహస్తిలో గాజుల అలంకరణలో ముత్యాలమ్మ

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజారి పరమేశ్వర స్వామి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో విశేషా అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరించారు.