నేడు కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల లాటరీ
NRML: జిల్లాలోని 47 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను నేడు నిర్వహించనున్నట్లు డీపీఈవో అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు ఉ.11 గంటలకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ ఉంటుందన్నారు.