VIDEO: శృంగవరంలో పర్యటించిన కేంద్ర బృందం
AKP: జాతీయ స్థాయి గుడ్ గవర్నెన్స్ పోటీలకు ఎంపికైన నాతవరం మండలం శృంగవరం గ్రామంలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం పర్యటించింది. వీరిని గ్రామస్థులు సాధరంగా ఆహ్వానించారు. డాక్టర్ జావీద్ నభీ, దీపేంద్ర కుమార్, ఓఎస్‌డీ శ్రీనాథ్ నేతృత్వంలోని బృందం గ్రామంలో వాట్సాప్ గవర్నెన్స్, స్వర్ణ పంచాయతీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.