బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు

బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై  కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు

RR: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో వివాదం రేగింది. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్వేతపై కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శ్వేత తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి, జనరల్ కేటగిరీకి చెందినప్పటికీ బీసీ రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసి గెలుపొందారని చంద్రకళ ఆరోపించారు. ఈ మేరకు కలెక్టర్ విచారణ చేపట్టే అవకాశం ఉంది.